శ్రీహరికోట (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 18
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రైవేటు సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రయోగించాల్సిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగానికి చివరి నిమిషంలో ఆటంకం ఏర్పడింది. సంస్థ చివరి నిమిషంలో ప్రయోగాన్ని హోల్డ్ చేసింది. అయితే, ప్రయోగాన్ని ఎందుకు నిలిపివేశారనే దానిపై సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
శ్రీహరికోట నుంచి ప్రైవేటు సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రయోగించాల్సిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగానికి చివరి నిమిషంలో బ్రేక్ పడింది. సంస్థ రాకెట్ ప్రయోగాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించింది. అయితే, ఈ ప్రయోగాన్ని ఎందుకు నిలిపివేయాల్సి వచ్చిందనే దానిపై స్కైరూట్ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రయోగం వాయిదా పడటానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.
సాధారణంగా రాకెట్ ప్రయోగాలకు ముందు అనేక దశల తనిఖీలు, కౌంట్‌డౌన్ ప్రక్రియలు జరుగుతాయి. ఈ క్రమంలో చివరి నిమిషంలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తినా లేదా ఇతర అనివార్య కారణాలు ఎదురైనా ప్రయోగాన్ని నిలిపివేసే అవకాశం ఉంటుంది. విక్రమ్-1 ప్రయోగం కూడా సాంకేతిక సమస్య కారణంగానే నిలిచిపోయి ఉండవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.











