కాసిపేట: గుండెపోటుతో ఉపాధ్యాయురాలు మృతి
కాసిపేట మండలం దేవపూర్ ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న చంద్రకళ (53) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. రెండు రోజుల క్రితం ఛాతిలో నొప్పి రావడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అనారోగ్యం తీవ్రతరం కావడంతో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు