హైదరాబాద్: సెప్టెంబర్ 25
తమిళ హీరో జయం రవి, విడాకుల అనంతరం తన భార్య ఆర్తి తనను ఇంటి నుంచి గెంటివేసిందని, తన వ్యక్తిగత వస్తువులను తిరిగి ఇవ్వాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పలు కారణాల వల్ల మీడియాలో చర్చకు దారితీసింది.
జయం రవి తన ఫిర్యాదులో ఆర్థిక, వ్యక్తిగత విషయాలను వివరించడమే కాకుండా, తనకు అవసరమైన వస్తువులను తక్షణమే తిరిగి ఇవ్వాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయం ప్రస్తుతం కోర్టు దాకా చేరే అవకాశముంది.