ఎమ్4 న్యూస్
తేదీ: అక్టోబర్ 11, 2024
తెలంగాణ: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రతి దసరాకు ఆయుధపూజ సమయంలో ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించాలనే ప్రతిజ్ఞ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. రోజుకు సగటున 20 మంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా, “ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే, మనం ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ట్రాఫిక్ నియమాలను పాటిద్దాం, హెల్మెట్, సీటు బెల్ట్ పెట్టుకుందామని కోరుతున్నాను. ప్రమాదం జరిగాక ఎవరూ ఏమీ చేయలేరు” అని మంత్రి చెప్పారు.
అతను మద్యం తాగి వాహనం నడపొద్దని సూచిస్తూ, “ఈ దసరాకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండి, పండగను ఆనందంగా జరుపుకుందామని” చెప్పారు.