భువనగిరి, 2026-09-05
వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతుల ఆవేదనను ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, రచయిత్రి మంజుల పత్తిపాటి తన రచన ద్వారా ఆవిష్కరించారు. నీవు వస్తావని ఆశ మామ అనే పేరుతో ఆమె రాసిన రచనలో రైతు కుటుంబాల పరిస్థితిని హృద్యంగా వివరించారు.
వర్షం కోసం రైతన్నల ఎదురుచూపు “రా మామా.. మా పొలాలకు ప్రాణం పోయి” — మంజుల పత్తిపాటి యాదాద్రి భువనగిరి : వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతన్నల ఆవేదనను ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, రచయిత్రి మంజుల పత్తిపాటి తన రచన ద్వారా ఆవిష్కరించారు. “నీవు వస్తావని ఆశ మామ…” అనే పేరుతో ఆమె రాసిన ఈ రచనలో రైతు కుటుంబాల పరిస్థితిని హృద్యంగా వివరించారు. ప్రకృతి విధ్వంసం, వెంచర్ల పేరుతో జరుగుతున్న పర్యావరణ నష్టం కారణంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం కోసం పొలాల వైపు ఆశగా చూస్తున్న రైతు కుటుంబాల పరిస్థితిని రచయిత్రి తన పదాల్లో ప్రతిబింబించారు. సద్ది తీసుకుని పొలం వద్దకు వచ్చిన రైతు, ఆకాశం వైపు చూస్తూ వర్షం కోసం ఎదురుచూస్తున్న దృశ్యాన్ని కళ్లకు కట్టినట్లు వివరించారు. వర్షాలు కురవక వ్యవసాయ పనులు మందగించడంతో రైతులతో పాటు వ్యవసాయ కూలీలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న కుటుంబాలు ఉపాధి, ఆహారం కోసం అవస్థలు పడుతున్న పరిస్థితిని రచనలో ప్రస్తావించారు. “వచ్చి మా పొలాలకు ప్రాణం పోసి.. మా ఆకలి కేకలను చల్లార్చు మామా” అంటూ వర్షాన్ని ఆప్యాయంగా వేడుకున్న తీరు రైతుల మనోవేదనను ప్రతిబింబిస్తోంది. ప్రకృతిని పరిరక్షించడంతో పాటు రైతుల జీవనాధారమైన వ్యవసాయాన్ని కాపాడాల్సిన అవసరాన్ని ఈ రచన చాటి చెబుతోంది. రచన: శ్రీమతి మంజుల పత్తిపాటి హోదా: ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జిల్లా: యాదాద్రి భువనగిరి తేదీ:












