న్యాయవాదులు జర్నలిస్టులుగా పనిచేయడం సుప్రీంకోర్టు అనుమతించదు

M4 న్యూస్ (ప్రతినిధి), ఢిల్లీ : అక్టోబర్ 22

 

  • సుప్రీంకోర్టు న్యాయవాదులు జర్నలిస్టులుగా పనిచేయడాన్ని తప్పుపట్టింది
  • బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నోటీసులు
  • బార్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం, ఇతర వృత్తుల్లో ఉండకూడదని స్పష్టం

సుప్రీంకోర్టు లా ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులు జర్నలిస్టులుగా కూడా పనిచేయడాన్ని తప్పు పట్టింది. కేసు విచారణ సందర్భంగా ఓ న్యాయవాది ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నట్టు తెలిసి, సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ద్వంద్వ పాత్రలను తాము అనుమతించమని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది.

సుప్రీంకోర్టు సోమవారం జరిగిన ఓ కేసు విచారణలో కీలక వ్యాఖ్యలు చేసింది. బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్పై దాఖలైన పిటిషన్లో న్యాయవాది మహ్మద్ కమ్రాన్, ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా కూడా పనిచేస్తున్నారని తెలుసుకున్న సుప్రీంకోర్టు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ద్వంద్వ పాత్రలను అనుమతించబోమని, లా ప్రాక్టీస్ చేస్తున్నవారు ఇతర వృత్తుల్లో ఉండకూడదని తేల్చిచెప్పింది.

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం, లాయర్‌గా ప్రాక్టీస్ చేసే వారు మరో వృత్తిలో కూడా కొనసాగరాదని నిబంధనలు చెబుతున్నాయి. సుప్రీంకోర్టు ఈ విషయాన్ని పునరుద్ఘాటిస్తూ, కమ్రాన్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పనిచేయడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నోటీసులు జారీ చేయడంతో పాటు, ఇలాంటి పరిస్థితులను పరిశీలించాల్సిందిగా సూచించింది.

Leave a Comment