నాగర్ కర్నూల్‌లో వీధి కుక్కల స్వైర విహారం – ప్రజలకు భయం

నాగర్ కర్నూల్ వీధి కుక్కల స్వైర విహారం

➡ రెండు రోజులుగా ప్రజలపై వీధి కుక్కల దాడులు
➡ వృద్ధుడిని 10 కుక్కలు చుట్టుముట్టి తీవ్రంగా గాయపరిచిన ఘటన
➡ చిన్నారులపై దాడులు, కుక్కకాట్లతో భయబ్రాంతులకు గురవుతున్న ప్రజలు
➡ అధికారులు వెంటనే స్పందించి కుక్కల సమస్యను పరిష్కరించాలని ప్రజల డిమాండ్

 

నాగర్ కర్నూల్‌లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. శనివారం రాత్రి సంజయ్ నగర్ కాలనీలో ఓ వృద్ధుడిపై 10 కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. అలాగే షాలి ఖాన్ వీధిలో 5 ఏళ్ల చిన్నారి మాహియాపై వీధి కుక్కలు దాడి చేశాయి. గత వారం రోజులుగా కుక్కలు అనేక మందిపై దాడి చేయడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు ఈ సమస్యపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

 

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేయడం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. గత రెండు రోజులుగా వీధి కుక్కల దాడులు పెరిగిపోతుండగా, శనివారం రాత్రి సంజయ్ నగర్ కాలనీలో ఓ వృద్ధుడిపై 10 కుక్కలు దాడి చేసి తీవ్ర గాయాలు కలిగించాయి. అతడిని స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.

ఇదే విధంగా, షాలి ఖాన్ వీధిలోని సల్మాన్ అనే వ్యక్తి కుమార్తె మాహియా ఫిర్దోస్ (05) ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేశాయి. చిన్నారి తీవ్రంగా గాయపడింది. శుక్రవారం హౌసింగ్ బోర్డ్ కాలనీలో షాకిర్ బేగం అనే మహిళపై కుక్కలు దాడి చేయగా, ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ఘటనలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వేసవి తీవ్రంగా ఉండే రోజుల్లో సాధారణంగా కుక్కల దాడులు పెరుగుతాయి. అయితే, వేసవి ప్రారంభమయ్యే లోపే కుక్కల దాడులు పెరగడం మరింత భయాందోళన కలిగిస్తోంది. ప్రతి వీధిలో వందల సంఖ్యలో వీధి కుక్కలు సంచరిస్తుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు.

ప్రజల భద్రత కోసమే వీధి కుక్కలను సంరక్షణ కేంద్రాలకు తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు, జిల్లా అధికారులు ఈ సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment