లోకేశ్వరం, జూలై 4
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం హథ్గాం గ్రామంలోని 181వ పోలింగ్ కేంద్రాన్ని శనివారం అధికారులు సందర్శించి, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారికి గణన పత్రాల సేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం హథ్గాం గ్రామంలోని 181వ పోలింగ్ కేంద్రాన్ని శనివారం అధికారులు సందర్శించి, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పురోగతిని పరిశీలించారు.
ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారికి గణన పత్రాల సేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఓటర్ల వివరాల నమోదు ప్రక్రియను ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా వేగవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి అర్హుడైన ఓటరు వివరాలు జాబితాలో నమోదయ్యేలా క్షేత్రస్థాయిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో మండల తహసీల్దార్ సూర్యారావు, గ్రామ పంచాయతీ అధికారి, బూత్ స్థాయి అధికారి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.











