హైదరాబాద్, జులై 17
తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు గణనీయంగా పెరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రీమియం, హయ్యర్ క్యాటగిరీ, చీప్ లిక్కర్ బ్రాండ్లపై ధరలు రూ.90 నుంచి రూ.120 వరకు పెరిగే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా పెరగనున్నాయి. దీనిపై ప్రభుత్వం త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది. ధరలు పెంచాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకోగా, అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సి ఉంది.
మద్యం ధరల పెంపునకు సంబంధించి రేవంత్ సర్కార్ ఓ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇటీవల వివిధ మద్యం తయారీ కంపెనీలతో సమావేశమైంది. పెరుగుతున్న ఖర్చుల కారణంగా మద్యం ధరలను పెంచాల్సిందేనని కమిటీ నివేదిక సమర్పించింది.
ఈ నివేదికను పరిశీలించిన అనంతరం, మద్యం కంపెనీల డిమాండ్ల మేరకు ధరలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మందుబాబులపై మరింత భారం మోపనుంది.
దాదాపు 20 శాతం మేరకు ధరలను పెంచనున్నారని తెలుస్తోంది. ప్రీమియం బ్రాండ్లకు సంబంధించి ఫుల్ బాటిల్‌పై రూ.100 వరకు, హయ్యర్ క్యాటగిరీ బ్రాండ్లపై రూ.120 వరకు పెరిగే అవకాశం ఉంది. ఎక్కువ మంది కొనుగోలు చేసే చీప్ లిక్కర్ బ్రాండ్లపై రూ.90 వరకు పెరిగే అవకాశముందని సమాచారం.












