భద్రాద్రి కొత్తగూడెం, 2026-07-17
తెలంగాణ రాష్ట్ర శాసనసభ షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ (ఎస్టీ) చైర్మన్గా నియమితులైన పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును సారపాక ఉప సర్పంచ్ కె. రమేష్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంఘటన మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగింది.
తెలంగాణ రాష్ట్ర శాసనసభ షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ (ఎస్టీ) చైర్మన్గా నియమితులైన పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును సారపాక ఉప సర్పంచ్ కె. రమేష్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నాయకత్వంలో పినపాక నియోజకవర్గం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కె. రమేష్ ఆకాంక్షించారు. అలాగే ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్గా గిరిజనుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు విశేష కృషి చేసి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ SK సైదులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గొల్లమారి రత్నా రెడ్డి, జిల్లా కార్యదర్శి వరాల వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.












