ముథోల్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 12
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం అత్యంత కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ముథోల్ తహసీల్దార్ శ్రీలత సూచించారు. మండల కేంద్రంలోని జీఎం గార్డెన్లో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ శిబిరాన్ని ఆమె ఆదివారం పరిశీలించారు.
మండల కేంద్రంలోని జీఎం గార్డెన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) శిబిరాన్ని తహసీల్దార్ శ్రీలత ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా శిబిరంలో జరుగుతున్న ఫారాల స్వీకరణ, పరిశీలన, నమోదు ప్రక్రియను ఆమె క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం అత్యంత కీలకమైనదని, అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదు అయ్యేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఎస్ఐఆర్ ఫారాలను పూర్తిస్థాయిలో నింపించి, అవసరమైన ఆధార పత్రాలను జత చేసి నిర్ణీత గడువులోగా అందించాలని బీఎల్వోలు, సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.
ఫారాల పరిశీలనలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని, తప్పులు, లోపాలు లేకుండా నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మార్గదర్శకాలు అందిస్తూ, సందేహాలను నివృత్తి చేయాలని అధికారులకు తెలిపారు. ఓటరు జాబితా పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ ఈవో అన్వర్ అలీ, రెవెన్యూ సిబ్బంది, బీఎల్వోలు, జీపీవోలు తదితరులు పాల్గొన్నారు.












