నిర్మల్, జూలై 6
ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ సూచనలు చేశారు.
ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎస్ఐఆర్ ప్రక్రియ, ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్దేశించిన గడువులోగా ఇంటింటికీ వెళ్లి బూత్ లెవెల్ అధికారులు (బీఎల్ఓలు) తప్పనిసరిగా ఎన్యుమరేషన్ ఫారాలను అందజేయాలని సూచించారు. బీఎల్ఓలు మాత్రమే ఫారాలు పంపిణీ చేయాలని, బీఎల్ఏలు లేదా ఇతర రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఫారాల పంపిణీ చేసే అధికారం లేదని స్పష్టం చేశారు.
ప్రజలకు ఎస్ఐఆర్ ప్రక్రియపై ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు అవసరమైతే అదనపు హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని, వివిధ మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ, జిల్లాలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. అన్ని నిబంధనలు పాటిస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, డిజిటలైజేషన్ ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ సమన్వయంతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డీఆర్వో రాథోడ్ రమేష్, ఆర్డీఓ దేవీదాస్, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












