నిర్మల్, జూలై 6
ప్రజావాణిలో అందే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులు, ఫిర్యాదులను ఆయన స్వయంగా స్వీకరించారు.
ప్రజావాణిలో అందుతున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజల నుంచి వచ్చిన వినతులు, ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పింఛన్లు, భూ సమస్యలు తదితర అంశాలకు సంబంధించిన వినతిపత్రాలను ప్రజలు కలెక్టర్కు సమర్పించారు. వాటిని సంబంధిత శాఖలకు పంపించి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
అలాగే జిల్లా ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రతిరోజూ తప్పనిసరిగా ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నిషన్) ద్వారా హాజరు నమోదు చేసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, డీఆర్వో రాథోడ్ రమేష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












