నిర్మల్, జూలై 11
రాష్ట్రంలో భూముల సర్వే, రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఖమ్మం కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో సమావేశంలో ఈ ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో భూముల సర్వే, రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
శనివారం ఖమ్మం కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో భూముల సర్వే, రీసర్వే అంశాలపై నిర్వహించిన వీడియో సమావేశంలో మంత్రి మాట్లాడారు. రెవెన్యూ పటాలు లేని గ్రామాలకు కొత్త పటాలు రూపొందించేందుకు సర్వే చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన 70 గ్రామాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీసర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు.
సర్వే, రీసర్వే ప్రక్రియను పూర్తిస్థాయిలో పారదర్శకంగా నిర్వహించాలని, జిల్లా కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి నిర్వహించిన ఈ వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, రెవెన్యూ డివిజనల్ అధికారి దేవీదాస్, భూసర్వేయర్ నరసింహమూర్తి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












