✊* (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 11
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసులు ఎదుర్కొంటున్న భూమి, అడవి, సహజ వనరుల దోపిడీకి వ్యతిరేకంగా వాటి రక్షణకై సన్నద్ధమై ఉద్యమాలు నిర్వహించాలని ఆదివాసి సేన రాష్ట్ర అధ్యక్షులు కోవా దౌలత్ రావు మోకాశి పిలుపునిచ్చారు. ములుగు జిల్లా మేడారంలో జరుగుతున్న ఆదివాసి సేన విస్తృతస్థాయి సమావేశాల్లో ఈ పిలుపు వెలువడింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసులు ఎదుర్కొంటున్న భూమి, అడవి, సహజ వనరుల దోపిడీకి వ్యతిరేకంగా వాటి రక్షణకై సమస్త ఆదివాసులు సన్నద్ధమై ఉద్యమాలు నిర్వహించాలని ఆదివాసి సేన రాష్ట్ర అధ్యక్షులు కోవా దౌలత్ రావు మోకాశి పిలుపునిచ్చారు.
ములుగు జిల్లా ఎస్.ఎస్ తాడ్వాయి మండలం, మేడారం కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర ఆదివాసి సేన విస్తృతస్థాయి సమావేశాలు జూలై 11, 12 తేదీలలో నిర్వహించనుంది. ఆదివాసి సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడి సాయిబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య వక్తగా హాజరైన కోవా దౌలత్ రావు మోకాశి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, ప్రత్యేకించి భూమి- అడవి- సహజ వనరుల దోపిడీ జరుగుతుందని అన్నారు.
ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన నేతలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో భాగస్వామ్యం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన భూ బదలాయింపు నిరోధక LTR చట్టం, అటవీ హక్కుల చట్టం-2006, పెసా చట్టం పటిష్ట అమలుకు సేన కార్యకర్తలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర నాయకులు మడి సాయిబాబు, గుండు శరత్, సోడే వెంకటేశ్వర్లు, పొడెం సమ్మయ్య, రాయిసిడం జంగూ పటేల్, చింత అరుణ, వజ్జ జ్యోతిబసు, ఊకె రవి, ఆలం శ్రీను, కోర్సా నరేష్, కల్తి నరేష్, రామస్వామి, యానక లక్ష్మీనారాయణ, శెట్టిపల్లి శీను, పోలేబోయిన ఆదినారాయణ, కల్తీ మధుసూదన్ రావు, కాక సురేష్, బొల్లి శ్రీనివాస్, మూత లక్ష్మి, కల్తి రమేష్ మరియు అదిలాబాద్, అసిఫాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.












