నిర్మల్, జూలై 25
శనివారం నిర్మల్ జిల్లా పోలీస్ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ డా. జి. జానకి షర్మిల మాట్లాడుతూ, పోలీసుల్లో శారీరక దృఢత్వం, ఆరోగ్య పరిరక్షణకు పరేడ్ దోహదపడుతుందని తెలిపారు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.
విధినిర్వహణ ఎంత ముఖ్యమో ఆరోగ్య పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ పేర్కొన్నారు. శనివారం జిల్లా పోలీస్ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, స్క్వాడ్ డ్రిల్‌ను ఎస్పీ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, వారానికి ఒకసారి నిర్వహించే పరేడ్ వల్ల పోలీసుల్లో శారీరక దృఢత్వం పెరగడంతో పాటు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడుతుందన్నారు. విధుల మధ్య లభించే సమయంలో వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలని, ఫిట్నెస్ను కాపాడుకోవడం ద్వారా మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించవచ్చని సూచించారు.
పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, వ్యక్తిగత, ఆరోగ్య లేదా విధులకు సంబంధించిన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఎస్పీ తెలిపారు. చెడు వ్యసనాలు, చెడు స్నేహాలకు దూరంగా ఉండి శాఖ ప్రతిష్టను కాపాడాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ మానసిక ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించుకోవాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, డీఎస్పీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు ప్రవీణ్, రవీందర్, సత్యనారాయణ, దీపక్, కృష్ణ, సమ్మయ్య, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు రామ్ నిరంజన్ రావు, శేఖర్, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.












