Suryapet/Mattampally (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 24
తెలంగాణ ప్రభుత్వం మీసేవ కేంద్రాలను డిజిటల్ అడ్వర్టైజింగ్ హబ్‌లుగా మార్చాలని నిర్ణయించింది. మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) సహకారంతో ఈ ప్రక్రియ చేపట్టనుంది. దీని ద్వారా చిన్న వ్యాపారాలకు తక్కువ ఖర్చుతో డిజిటల్ ప్రకటనలు చేసుకునే అవకాశం లభిస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం మీసేవ కేంద్రాలను డిజిటల్ అడ్వర్టైజింగ్ హబ్‌లుగా మార్చనుంది. మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) సహకారంతో ఈ నూతన సేవలు ప్రారంభం కానున్నాయి. దీని ద్వారా చిన్న వ్యాపారాలు తక్కువ ఖర్చుతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లలో డిజిటల్ ప్రకటనలు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం మీసేవ నిర్వాహకులకు అదనపు ఆదాయ అవకాశాలను కూడా కల్పిస్తుంది. ఇది తెలంగాణలో డిజిటల్ మార్కెటింగ్‌ను ప్రోత్సహించే ఒక వినూత్న ప్రయత్నం.












