బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 24
సోనాల మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం–2లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'అమ్మ చేతి తొలి ముద్ద' కార్యక్రమాన్ని బోథ్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గుడాల అనీష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పౌష్టికాహారం అందించి, వారి ఆరోగ్య సంరక్షణపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
సోనాల మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం–2లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'అమ్మ చేతి తొలి ముద్ద' కార్యక్రమాన్ని బోథ్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గుడాల అనీష్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా చిన్నారులకు పౌష్టికాహారం అందించి, తల్లిదండ్రులకు చిన్నారుల ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రత, సమతుల్య ఆహారం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఆరోగ్యవంతమైన చిన్నారులే దేశ భవిష్యత్తుకు బలమైన పునాదని ఆయన పేర్కొన్నారు.
పిల్లలకు పౌష్టికాహారం అందించడం ద్వారా వారు దృఢమైన ఆరోగ్యంతో ఎదుగుతారని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రతి రోజు చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉపాధ్యాయురాలు అశ్విని, మార్కెట్ డైరెక్టర్ సోమన్న, నాయకులు సుదర్శన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.












