మిర్యాలగూడ, జూలై 10
మిర్యాలగూడ మండలంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు విస్తృత సవరణ సర్వేను ఆర్డీవో ఎస్. రమణారెడ్డి శుక్రవారం క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బాధలాపురం, గూడూరు గ్రామాల్లో ఇంటింటి గణన సర్వేను పరిశీలించిన ఆయన, ఫారంల నమోదు, ఆన్ లైన్ ప్రక్రియపై అధికారులకు సూచనలు ఇచ్చారు.
ప్రత్యేక ఓటరు విస్తృత సవరణ సర్వే (సర్) ను శుక్రవారం ఓటరు నమోదు అధికారి, మిర్యాలగూడ ఆర్డీవో ఎస్. రమణారెడ్డి తనిఖీ చేశారు. మిర్యాలగూడ మండలంలోని బాధలాపురం గ్రామంలో గల పిఎస్ నెంబర్ 179 పరిధిలో ఇంటింటి గణన సర్వేను ఆయన పరిశీలించారు. అదేవిధంగా మండలంలోని గూడూరు గ్రామంలో పీఎస్ నెంబర్ 190, 191లో ఇంటింటి గణనను కూడా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆర్డీవో రమణారెడ్డి మాట్లాడుతూ, సర్ ఫారంలను పూర్తి చేసిన వెంటనే ఆన్ లైన్ చేయాలని సూచించారు. ఎన్నికల సంఘ నియమావళిని అనుసరించి, ప్రత్యేక విస్తృత సవరణ సర్వే ఆధారంగా ప్రతి ఓటరు పూర్తి వివరాలను నమోదు చేయాలన్నారు.
ఓటర్ల నమోదుపై అవగాహన ఏర్పరచుకొని, క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, తప్పులు లేని పరిపూర్ణ ఓటర్ల జాబితాను నమోదు చేయాలని, దీనికి బూత్ లెవెల్ ఏజెంట్లు (బిఎల్ఓలకు) సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఆర్. ఐ. కృష్ణయ్య, బి.ఎల్.ఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.











