(2388)** (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 31
నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు శాఖలో సుదీర్ఘకాలం విశిష్ట సేవలందించి పదవీ విరమణ పొందిన అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన వారికి సన్మానం చేశారు.
నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయం డీపీఓలో పోలీసు శాఖలో సుదీర్ఘకాలం విశిష్ట సేవలందించి పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన వారికి శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగం కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం అంకితభావంతో పనిచేసే అత్యంత బాధ్యతాయుతమైన సేవ అని అన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొంటూ, శాంతిభద్రతల పరిరక్షణలో, నేర నియంత్రణలో, ప్రజలకు భరోసా కల్పించడంలో పోలీసు సిబ్బంది అందించిన సేవలు అమూల్యమైనవని పేర్కొన్నారు.
పదవీ విరమణ అనేది ప్రభుత్వ విధులకు మాత్రమే ముగింపు అని, సమాజ సేవకు కాదని పేర్కొంటూ, తమ అనుభవాన్ని యువతకు, సమాజానికి పంచుతూ మార్గదర్శకులుగా కొనసాగాలని సూచించారు. పదవీ విరమణ అనంతరం ఆరోగ్యంగా, ఆనందంగా కుటుంబసభ్యులతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన డీఎస్బీ నిర్మల్‌కు చెందిన ఎస్ఐ ఎం. నరసయ్య, నిర్మల్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఎస్ఐ ఎం. తారాచంద్ (1764), బాసర పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఎస్ఐ వై. గంగాధర్ (480), లక్ష్మణచాందా పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఎల్. శంకర్ (2388)లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, పోలీసు శాఖకు వారు అందించిన విశిష్ట సేవలను కొనియాడుతూ సత్కరించారు.
ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఓ) ఎం.డి. యూనుస్ అలీ, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ, నిర్మల్ టౌన్ సీఐ సమ్మయ్య, ఆర్ఐ రామ్‌నిరంజన్, ఆర్ఎస్ఐ రామకృష్ణతో పాటు జిల్లా పోలీసు కార్యాలయ అధికారులు, పోలీసు సిబ్బంది, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు.












