నిర్మల్, జూలై 17
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న మొబైల్ వెటర్నరీ సర్వీసెస్ ప్రాజెక్టు కింద నిర్మల్ జిల్లాలో పారావెట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. డిప్లొమా ఇన్ వెటర్నరీ సైన్స్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న 1962 పశు సంచార వాహన (మొబైల్ వెటర్నరీ సర్వీసెస్) ప్రాజెక్టు కింద నిర్మల్ జిల్లాలో పారావెట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ లింగాచారి తెలిపారు.
ఈ పోస్టులకు డిప్లొమా ఇన్ వెటర్నరీ సైన్స్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ఎంపికైన అభ్యర్థులు మొబైల్ వెటర్నరీ బృందంతో కలిసి గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు వైద్య సేవలు అందించడంలో వెటర్నరీ వైద్యుడికి సహాయపడాల్సి ఉంటుంది. పశువుల చికిత్స, టీకాల కార్యక్రమాలు, మందుల నిర్వహణ, వైద్య రికార్డుల నిర్వహణ, పశుపోషకులకు అవగాహన కల్పించడం, ఫీల్డ్ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడం వంటి బాధ్యతలు ఉంటాయని తెలిపారు.
ఎంపిక ప్రక్రియ: జూలై 22, 2026న నిర్వహించబడుతుంది. స్థలం: 108 కార్యాలయం, ఫైర్ స్టేషన్ సమీపంలో, నిర్మల్.
సంప్రదించవలసిన వారు: జిల్లా ప్రాజెక్టు మేనేజర్ లింగాచారి. సంప్రదింపు నంబర్: 8008085938.












