(జి) (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 17
నిర్మల్ జిల్లా, నరసాపూర్ (జి) మండలంలోని బూరుగుపల్లి (కె) గ్రామంలో గురువారం రాత్రి పాము కాటుకు గురైన 12 ఏళ్ల విద్యార్థి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
నిర్మల్ జిల్లా, నరసాపూర్ (జి) మండలంలోని బూరుగుపల్లి (కె) గ్రామంలో పాము కాటుకు గురైన 12 ఏళ్ల విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది.
ఎస్సై గణేష్ తెలిపిన వివరాల ప్రకారం.. బూరుగుపల్లి (కె) గ్రామానికి చెందిన గుడుములవార్ ఋషికేష్ (12) గురువారం రాత్రి పాము కాటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే అత్యవసర వైద్య సేవల వాహనంలో నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం ఋషికేష్ మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గణేష్ తెలిపారు.












