షాద్నగర్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 17
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని పులుసుమామిడి గ్రామంలో రూ.5 లక్షల డీఎంఎఫ్టీ (DMFT) నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోగురి పురుషోత్తం రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో అభివృద్ధి పనులు వేగవంతం అవుతున్నాయని ఆయన తెలిపారు.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని పులుసుమామిడి గ్రామంలో రూ.5 లక్షల డీఎంఎఫ్టీ (DMFT) నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోగురి పురుషోత్తం రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ సహకారంతో షాద్నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
పులుసుమామిడి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయితే గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని, వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోతాయని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు అంజి రెడ్డి, మాజీ సర్పంచ్ జంగీర్, బోరేగ నరేందర్, రాఘవేంద్ర, బబ్లూ గౌడ్, చంద్రయ్య, ఏఈ మధు, శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.












