మిర్యాలగూడ, జూలై 17
మిర్యాలగూడ పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచడమే లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి అన్నారు. శుక్రవారం హనుమాన్ పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద చేపట్టనున్న సుందరీకరణ పనుల్లో భాగంగా పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఆయన మాట్లాడారు. ఈ పనుల ద్వారా పట్టణాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
మిర్యాలగూడ పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచడమే లక్ష్యంగా పనిచేస్తానని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి అన్నారు. శుక్రవారం హనుమాన్ పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద చేపట్టనున్న సుందరీకరణ పనుల్లో భాగంగా పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఆయన మాట్లాడారు.
ఫ్లైఓవర్ కింది భాగాన్ని ప్రజలకు ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన విశ్రాంతి ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు సుందరీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. పార్క్ ప్రాంగణంలో 'మహిళా శక్తి క్యాంటీన్' ద్వారా పేద ప్రజలకు ఆకలి తీర్చేందుకు రూ.5కే భోజన క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజా రెడ్డి, పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు ఆంగోతు చక్ర నాయక్, అవుట శ్రీనివాస్, ఆడోతు అశోక్ నాయక్, నాయకులు దేశిడి శేఖర్ రెడ్డి, చిలుకూరి బాలకృష్ణ, గుడిపాటి నవీన్ కుమార్, లక్ష్మణ్, అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.












