లక్ష్మణచాంద, 2026-06-05
ెెణెడెబెఉడఎడఉెడబడడడెబడెడఉెడె.
లక్ష్మణ్ చందా మండలంలోని మునిపెల్లి గ్రామంలో రాబోయే గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, చమనపల్లి ఎక్స్ రోడ్ నుంచి మునిపెల్లి గోదావరి వరకు ఉన్న రహదారిని అభివృద్ధి చేసి డబుల్ రోడ్డుగా మార్చాలని, అలాగే మునిపెల్లి వద్ద కొత్త బ్రిడ్జిని మంజూరు చేయాలని కోరుతూ మునిపెల్లి సర్పంచ్ మేడిపల్లి సునీత గంగాధర్, ఉప సర్పంచ్ రంజిత్ రెడ్డి తో పాటు గ్రామస్తులు నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కుచాడి శ్రీహరిరావుకు వినతిపత్రం అందజేశారు.
ఈ ప్రాంతానికి పుష్కరాల సమయంలో భక్తుల రాకపోకలు అధికంగా ఉంటాయని, వారి సౌకర్యార్థం చమనపల్లి ఎక్స్ రోడ్ నుంచి మునిపెల్లి గోదావరి వరకు ఉన్న ప్రధాన రహదారిని అభివృద్ధి చేసి డబుల్ రోడ్డుగా నిర్మించాలని వినతిలో కోరారు. ప్రస్తుతం ఉన్న పాత బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణానికి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
రోడ్డు విస్తరణ, కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులకు సంబంధించిన అంచనాలను సిద్ధం చేయించి, అవసరమైన నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేయాలని గ్రామస్తులు శ్రీహరిరావును కోరారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రాన్ని అందజేశారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన కుచాడి శ్రీహరిరావు, ఈ సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో లక్ష్మణచంద్ మండలాధ్యక్షులు కొండ్రు నరేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఈటల శ్రీనివాస్, నల్లాల లింగారెడ్డి, పోన్కల్ గంగారెడ్డి, పోన్కల్ లింగన్న, మునిపల్లి లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మునిపల్లి సర్పంచ్, ఉపసర్పంచ్లు శ్రీహరిరావుకు వినతిపత్రం అందజేశారు.












