బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 11
బజార్ హత్నూర్ మండలంలోని కోలారి గ్రామం వద్ద గల ప్రధాన బ్రిడ్జి వర్షపు నీటితో బురదగా మారడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై గ్రామస్తులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దృష్టికి తీసుకురాగా, ఆయన తక్షణమే స్పందించి మరమ్మతు పనులు చేపట్టారు.
బజార్ హత్నూర్ మండలంలోని కోలారి గ్రామం వద్ద గల ప్రధాన బ్రిడ్జి వర్షపు నీటితో బురదగా మారడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై గ్రామస్తులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దృష్టికి తీసుకురాగా, ఆయన తక్షణమే స్పందించి మరమ్మతు పనులు చేపట్టారు. ఈ సందర్భంగా జరుగుతున్న పనులను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్వయంగా పరిశీలించి, బ్రిడ్జి వద్ద నెలకొన్న ఇబ్బందుల గురించి జిల్లా ఎస్పీతో మాట్లాడారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సాయినాథ్, ఉప సర్పంచ్ రియాజ్, నెరడిగొండ మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, సర్పంచుల సంఘం అధ్యక్షులు స్వామి, శ్రీధర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












