లోకేశ్వరం, 21 July
లోకేశ్వరం మండల పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా ప్రదీప్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో పనిచేసిన ఎస్సై అశోక్ బదిలీ అవడంతో ఆయన స్థానంలో ప్రదీప్ నియమితులయ్యారు. ప్రజలకు నిరంతరాయంగా సేవలు అందిస్తానని ఆయన తెలిపారు.
లోకేశ్వరం మండల పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా ప్రదీప్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఎస్సై అశోక్ బదిలీ కావడంతో ఆయన స్థానంలో ప్రదీప్ బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా నూతన ఎస్సై ప్రదీప్ మాట్లాడుతూ.. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ పారదర్శకమైన సేవలు అందిస్తామని తెలిపారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని, శాంతిభద్రతల నిర్వహణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.












