నిర్మల్, జూలై 21
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో వెనుకబడిన జిల్లాలు పనులను వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాల వారీగా డిజిటలైజేషన్ పురోగతిని సమీక్షించిన ఆయన, వారంలోగా అన్ని జిల్లాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను 90 శాతానికి చేర్చి, వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు.
ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారంలో ఆధార్ నంబర్ నమోదు కేవలం ఐచ్చికమేనని, అది తప్పనిసరి కాదని స్పష్టం చేశారు. ప్రక్రియ పూర్తయ్యే వరకు జిల్లా కలెక్టర్లు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ భవేశ్ మిశ్రా, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డీఆర్వో రాథోడ్ రమేష్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.












