ఖానాపూర్, జూలై 31
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఖానాపూర్ పట్టణంలోని 7వ వార్డు పరిధిలోని పద్మావతి నగర్లో పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఈ సమస్యపై వెంటనే స్పందించిన 7వ వార్డు కౌన్సిలర్ నిమ్మల రమేశ్, మున్సిపల్ అధికారుల సహకారంతో జేసీబీ యంత్రం ద్వారా నీటిని తొలగించేలా చర్యలు చేపట్టారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఖానాపూర్ పట్టణంలోని 7వ వార్డు పరిధిలోని పద్మావతి నగర్లో పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న 7వ వార్డు కౌన్సిలర్ నిమ్మల రమేశ్ వెంటనే స్పందించారు.
శుక్రవారం మున్సిపల్ అధికారులకు సమాచారం అందించిన అనంతరం, మున్సిపాలిటీకి చెందిన జేసీబీ యంత్రం సహాయంతో వరద నీరు బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టారు. ఈ చర్యలతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.
సమస్యను వెంటనే గుర్తించి, అధికారులతో సమన్వయం చేసుకుంటూ వరద నీటిని తొలగించడంలో చొరవ చూపిన కౌన్సిలర్ నిమ్మల రమేశ్‌ను స్థానికులు అభినందించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు.












