కడం (పెద్దూర్), గురువారం
నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు నుంచి వరద నీటి విడుదల పెంచారు. గురువారం ఉదయం 11:50 గంటలకు ప్రాజెక్టు గేట్లను మరింత ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 9 గేట్లను తెరిచి ఉంచగా, 67,966 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది.
కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం ఉదయం 11:50 గంటలకు ప్రాజెక్టు గేట్లను మరింత ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేశారు.
ఇప్పటికే తెరిచి ఉన్న 5, 6, 7, 8, 9, 10 నంబర్ గేట్లను ఒక్కో అడుగు చొప్పున అదనంగా ఎత్తారు. 4వ గేటును 3 అడుగులు, 11వ గేటును 4 అడుగులు, 12వ గేటును 6 అడుగులు ఎత్తినట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 694.250 అడుగులుగా నమోదైంది. మొత్తం 18 గేట్లలో 9 గేట్లను తెరిచి ఉంచారు. ప్రస్తుత వరద నీటి విడుదల 67,966 క్యూసెక్కులుగా ఉంది.












