ఎల్కతుర్తి, హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 04
హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న ఆర్ అండ్ బీ రోడ్లు, అభివృద్ధి పనులపై రాష్ట్ర రోడ్లు, భవనాల మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో గురువారం చర్చించారు. పెండింగ్ పనులను వేగవంతం చేయాలని, ప్రమాదాలు జరుగుతున్న ఎల్కతుర్తి జంక్షన్‌ను విస్తరించాలని కోరారు.
*హుస్నాబాద్ ఆర్అండ్బీ పెండింగ్ పనులకు వేగం పెంచాలి* * మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిసి పెండింగ్ పనులపై చర్చించిన మంత్రి పొన్నం ప్రభాకర్ * సిద్దిపేట–ఎల్కతుర్తి రహదారి పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి * ఎల్కతుర్తి జంక్షన్ బాటిల్‌నెక్‌కు శాశ్వత పరిష్కారం * ప్రమాదాల నివారణకు రోడ్డు విస్తరణపై చర్యలు * హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ ఆర్అండ్బీ పనులకు త్వరలో వేగం ** -మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి*👆 *హైదరాబాద్ :* హుస్నాబాద్ నియోజకవర్గంలో ఆర్ అండ్ బీ పెండింగ్ పనులపై గురువారం సచివాలయంలో *రాష్ట్ర రోడ్లు, భవనాల మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు.* ఈ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పలు ఆర్ అండ్ బీ రోడ్లు, అభివృద్ధి పనులపై చర్చించారు. ఇప్పటికే మంజూరైన పనుల పురోగతి, పెండింగ్‌లో ఉన్న పనులు, కొత్తగా ప్రతిపాదించిన రోడ్ల వివరాలను సమీక్షించారు. ప్రత్యేకంగా సిద్దిపేట–ఎల్కతుర్తి జాతీయ రహదారి పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేయాలని, పెండింగ్ కల్వర్టుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. అలాగే మిట్టపల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) పనులను కూడా వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఎల్కతుర్తి జంక్షన్ వద్ద కరీంనగర్, హనుమకొండ, సిద్దిపేట వైపు వెళ్లే రహదారులు కలుస్తున్న ప్రాంతంలో రోడ్డు ఇరుకుగా ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. అలాగే కరీంనగర్–ఎల్కతుర్తి, ఎల్కతుర్తి–హనుమకొండ మధ్య కొనసాగుతున్న రోడ్డు పనులను వేగవంతం పూర్తి చేయాలన్నారు. *ఈ సమస్యపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి,* ఎల్కతుర్తి జంక్షన్‌ను విస్తరించి *బాటిల్‌నెక్* సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న రోడ్లు, కల్వర్టులు, ఆర్ఓబీ పనులను ప్రాధాన్యతతో పూర్తి చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చారు.












