బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 10
ఇచ్చోడ మండలంలోని దుబార్ పేట్ గ్రామంలో రూ. 10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన వంతెనను బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆడే గజేందర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. స్థానిక సర్పంచ్ ప్రవీణ-విఠల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తుల రవాణా ఇబ్బందులు తొలగిపోయాయి.
ఇచ్చోడ మండలంలోని దుబార్ పేట్ గ్రామంలో రూ. 10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన వంతెనను బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆడే గజేందర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. స్థానిక సర్పంచ్ ప్రవీణ-విఠల్ ఆధ్వర్యంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది.
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వంతెన నిర్మాణం పూర్తి కావడంతో గ్రామస్తుల రవాణా ఇబ్బందులు తొలిగాయి. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి సహకరించిన బోథ్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆడే గజేందర్ కి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కళ్ళెం నారాయణ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యవతి కోటేశ్, మాదాపూర్ సర్పంచ్ ఇమ్రాన్ - షాదుల్లా, బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ చైర్మన్ ముస్తఫా, బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ SC సెల్ అధ్యక్షులు కొత్తూరు లక్ష్మణ్, బోథ్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం పోతరెడ్డి, St సెల్ మండల అధ్యక్షుడు నాగరాజ్, కేశవపట్నం మాజీ MPTC రషీద్, నాయకులు చోలే ప్రభాకర్, మహమూద్, గంగారం, మౌలానా, ఫరూక్, పటేల్ నాగరావు, గ్రామస్తులు భీంబాయి, కోసెరవు, వెంకటి, సలేరావు తదితరులు పాల్గొన్నారు.












