సారంగాపూర్ జులై 07 మనోరంజని తెలుగు టైమ్స్
నిర్మల్ జిల్లా,
సారంగాపూర్: మండలం వడ్డెర కాలనీకి చెందిన శివరాత్రి నరసింహులు ఇటీవల దుబాయిలో గుండె పోటుతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి. సత్యనారాయణ గౌడ్, మంగళవారం. బాధిత కుటుంబాన్ని పరామర్శించి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకొని ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.బాధిత కుటుంబ సభ్యులకు ₹10 వేలు, సాధు రాంరెడ్డి రూ.2వేల 500/- లుఆర్థిక సహాయం అందజేశారు.వీరివెంటా.. జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడు ప్రభాకర్, తెలంగాణ ఉద్యమకారులు సాదు రామ్ రెడ్డి, సామల వీరయ్య, సారంగపూర్ వడ్డెర సంఘం మండల అధ్యక్షుడు స్వర్ణ శ్రీనివాస్, చిన్నయ్య ఉన్నారు.












