నిర్మల్, జులై 17
భూముల సర్వే, రీ సర్వే ప్రక్రియల ద్వారా భూ సమస్యలు, వివాదాలు పరిష్కారం అవుతాయని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు.
భూముల సర్వే, రీ సర్వే నిర్వహణ ద్వారా భూ సమస్యలు పరిష్కారం అవుతాయని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లాలో కొనసాగుతున్న భూముల సర్వే, రీ సర్వే ప్రక్రియపై అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెవెన్యూ మ్యాపులు లేని గ్రామాలకు మ్యాపులు తయారు చేయడానికి, భూముల హద్దులు శాస్త్రీయంగా గుర్తించడానికి అధునాతన పరికరాల ద్వారా సర్వే, రీ సర్వే ప్రక్రియను చేపట్టడానికి ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో సర్వేయర్లు, లైసెన్స్డ్ సర్వేయర్లు బాధ్యతగా పనిచేసి సమయానికి ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. గ్రామాలలో భూముల సమస్యలు, వివాదాల పరిష్కారానికి ఈ సర్వే ప్రక్రియ కీలకమని వివరించారు. ఒక గుంట భూమి మొదలుకొని, ఎకరాల భూముల సర్వేను పకడ్బందీగా, పారదర్శకంగా చేపట్టాలని తెలిపారు.
ఇప్పటివరకు పూర్తిచేసిన సర్వే, రీ సర్వే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులకు, సిబ్బందికి ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయేమో అని తెలుసుకున్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఎడి ల్యాండ్ సర్వే రికార్డ్ నరసింహ మూర్తి, సర్వేయర్లు, లైసెన్స్డ్ సర్వేయర్లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












