నిర్మల్, జూలై 14
నిర్మల్ జిల్లా ప్రజల సమస్యలు, ఫిర్యాదులను నేరుగా స్వీకరించేందుకు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ ఈ నెల 15వ తేదీన (బుధవారం) భైంసాలో అందుబాటులో ఉండనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు భైంసా క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించనున్నట్లు పోలీసులు తెలిపారు.
జిల్లా ప్రజల సమస్యలు, ఫిర్యాదులను నేరుగా స్వీకరించేందుకు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ బుధవారం భైంసాలో అందుబాటులో ఉండనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 15వ తేదీ (బుధవారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు భైంసా క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరిస్తారని పేర్కొన్నారు.
ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన ఆధారాలతో నేరుగా హాజరై ఫిర్యాదులు అందజేయాలని జిల్లా పోలీసు అధికారులు సూచించారు.












