మిర్యాలగూడ, జూలై 31
పోలీసు శాఖలో మూడున్నర దశాబ్దాల పాటు సేవలందించిన ఏఎస్ఐ నందిపాటి ప్రభాకర్ సేవలు స్ఫూర్తిదాయకమని షీ టీం ఇన్చార్జి సీఐ మంజుల కొనియాడారు. శుక్రవారం మిర్యాలగూడలో జరిగిన ఆయన ఉద్యోగ విరమణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ప్రభాకర్ నిబద్ధత, అంకితభావం ప్రశంసనీయమన్నారు.
పోలీసు శాఖలో వివిధ హోదాల్లో సుమారు మూడున్నర దశాబ్దాల పాటు సేవలందించిన ఏఎస్ఐ నందిపాటి ప్రభాకర్ సేవలు అభినందనీయమని షీ టీం ఇన్చార్జి సీఐ మంజుల అన్నారు. శుక్రవారం మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన ప్రభాకర్ ఉద్యోగ విరమణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ శాంతిభద్రతలతో పాటు షీ టీం విభాగంలో ప్రభాకర్ నిబద్ధత, అంకితభావంతో ఆయన అందించిన సేవలు స్ఫూర్తిదాయకమన్నారు.
పోలీసు శాఖలో నిజాయితీగల ఉద్యోగిగా పలువురి మన్ననలు పొందిన ఆయన ఉద్యోగ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పోలీసింగ్ చక్కటి నిర్వచనం ఆయన సేవ నిరతి అని, తమకు అప్పగించిన బాధ్యతలను విద్యుత్కా ధర్మంతో సమాజ హితం కొరకు పోలీస్ సేవలు అందించిన ఆయన పలువురికి ఆదర్శప్రాయుడన్నారు.
ఉద్యోగ విరమణ సన్మాన గ్రహీత ప్రభాకర్ మాట్లాడుతూ తన విధి నిర్వహణలో తనకు సహకరించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో షీ టీం ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఏఎస్ఐ తబిత, హెడ్ కానిస్టేబుల్ మౌజం హుస్సేన్, మట్టయ్య, కానిస్టేబుల్స్ రాజేశ్వరి, యాస్మిన్, హోంగార్డ్స్ రవి, మధు, అయూబ్ తదితరులున్నారు.












