నిర్మల్, జూలై 31
నిర్మల్ జిల్లాలో ఆగస్టు మాసమంతా పోలీస్ యాక్ట్ సెక్షన్–30 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ప్రకటించారు. ప్రజలు బహిరంగ కార్యక్రమాలు నిర్వహించాలంటే తప్పనిసరిగా పోలీసుల అనుమతి పొందాలని ఆమె సూచించారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు వంటివి నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ సెక్షన్–30 అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల తెలిపారు. ఈ మేరకు మనోరంజని తెలుగు టైమ్స్ కు ఆమె సమాచారం అందించారు.
ముందస్తు పోలీసు అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు నిర్వహించరాదని ఆమె సూచించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అలాగే, సోషల్ మీడియాలో వదంతులు, విద్వేషపూరిత పోస్టులు ప్రచారం చేసిన వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని, బహిరంగ కార్యక్రమాలకు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని ఎస్పీ కోరారు.












