మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 30
ఉమ్మడి ADB జిల్లాలో మొత్తం 980 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలకు సంబంధించిన పూర్తి వివరాలను తాజాగా విడుదల చేశారు. కొమురం భీం అసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలతో పాటు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ పోస్టులు కేటాయించారు.
ఉమ్మడి ADB జిల్లాలో మొత్తం 980 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నియామకాల వివరాలను తాజాగా విడుదల చేశారు. కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో సివిల్ 86, ఆర్మర్డ్ రిజర్వ్ (AR) 39, ఫైర్ 9, జైళ్ల శాఖలో 3 పోస్టులు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో సివిల్ 130, AR 55, ఫైర్ 12, జైళ్ల శాఖలో 4 పోస్టులు కేటాయించారు.
నిర్మల్ జిల్లాలో సివిల్ 103, AR 40, ఫైర్ 11, జైళ్ల శాఖలో 4 పోస్టులు ఉన్నాయి. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సివిల్ 353, AR 110 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. మంచిర్యాల జిల్లాలో ఫైర్ 16, జైళ్ల శాఖలో 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.












