Kurnool/Maddikera East (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 15
రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలని, ఎన్యూమరేషన్ ఫారాలను వెంటనే అందించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో పేరు నమోదుకు ఫారం సమర్పణ, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఓటరు సంతకం, తేదీ, బీఎల్వో సంతకం తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాలను వెంటనే అందించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫారం సమర్పించిన వారికి మాత్రమే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో పేరు నమోదు అవుతుందని, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఓటరు సంతకం, తేదీ, బీఎల్వో సంతకం తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని సూచించారు.
సమర్పించిన ఫారాల్లో ఒక కాపీని బీఎల్వోకు, మరో కాపీని ఓటరు తమ భద్రపరచుకోవాలి. 2002 ఓటరు జాబితా వివరాలు ఉంటే వాటితోనే ఫారం నింపాలి. పాత వివరాలు లేనివారు ప్రస్తుత వివరాలతో ఫారం పూరించవచ్చు. ఇప్పటివరకు 1,66,70,610 మంది (49.28%) ఓటర్లు ఫారాలు సమర్పించారు.
రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3,38,26,448 మంది ఉన్నారు. మరో 10 రోజుల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్) ముగియనుంది. ఆమూల్యమైన ఓటు హక్కును కాపాడుకోవాలంటే ఓటర్లు వెంటనే ఫారాలు అందజేయాలని సీఈఓ సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.












