Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 23
మామడ మండలంలోని కొరిటికల్ గ్రామపంచాయతీ పరిధిలో జలసిరి కార్యక్రమంలో భాగంగా పారంపండు నూతన నిర్మాణం చేపట్టేందుకు భూమిని గుర్తించి సరిహద్దులు నిర్ధారించారు. మాజీ సర్పంచ్ పాట్కూరి భోజవ్వ–బాపురెడ్డి పట్టా భూమిలో ఈ గుర్తించే కార్యక్రమం గురువారం జరిగింది.
మామడ మండలంలోని కొరిటికల్ గ్రామపంచాయతీ పరిధిలో జలసిరి కార్యక్రమంలో భాగంగా పారంపండు నూతన నిర్మాణం చేపట్టేందుకు మాజీ సర్పంచ్ పాట్కూరి భోజవ్వ–బాపురెడ్డి పట్టా భూమిలో గురువారం భూమిని గుర్తించి సరిహద్దులు నిర్ధారించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోతె రాజేశ్వర్, మండల అభివృద్ధి అధికారి విజయ్, మండల సహాయ కార్యక్రమ అధికారి శివాజీ, గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, మండల రెవెన్యూ కార్యాలయ సిబ్బంది రవి, సురేష్, క్షేత్ర సహాయకుడు రాజలింగం, కారోబార్ శ్రవణ్, ఉపాధి హామీ కూలీలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
అధికారులు పనులను నాణ్యత ప్రమాణాలతో త్వరగా పూర్తి చేయాలని సూచించారు.












