మెండోరా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 09
నిజామాబాద్‌లో జరిగిన జిల్లా స్థాయి 14 ఏళ్లలోపు బాలుర అత్యా–పత్య ఎంపిక పోటీల్లో పోచంపాడ్ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ నెల 6న జిల్లా క్రీడా మైదానంలో జరిగిన పోటీల్లో దిల్వార్, రిషివర్ధన్, నిహాల్, సుందర్, నిక్షిత్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
నిజామాబాద్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి 14 ఏళ్లలోపు బాలుర అత్యా–పత్య ఎంపిక పోటీల్లో పోచంపాడ్ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 6వ తేదీన నిజామాబాద్ జిల్లా క్రీడా మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో పోచంపాడ్ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన దిల్వార్, రిషివర్ధన్, నిహాల్, సుందర్, నిక్షిత్ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నారు.
రాష్ట్రస్థాయి అత్యా–పత్య క్రీడా పోటీలు ఈ నెల 11, 12 తేదీల్లో సిద్ధిపేటలో జరగనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి. మహిపాల్ రెడ్డి తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, దూద్గాం గ్రామ సర్పంచ్ బాబా అభినందించారు. విద్యార్థులకు సమర్థవంతంగా శిక్షణ అందించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యేలా కృషి చేసిన శారీరక విద్య ఉపాధ్యాయుడు సంజీవ్‌ను సర్పంచ్, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు.











