భైంసా టౌన్‌లో మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక కౌన్సిలింగ్

భైంసా టౌన్‌లో మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక కౌన్సిలింగ్

భైంసా టౌన్‌లో మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక కౌన్సిలింగ్

మనోరంజని ప్రతినిధి భైంసా సెప్టెంబర్ 21

భైంసా టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్లు వాహనాలు నడపడం గుర్తించిన పోలీసులు వారికి, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్ సూపరింటెండెంట్ అవినాష్ కుమార్ IPS, టౌన్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ నేతృత్వం వహించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ –

👉 మైనర్లు వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని, తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని స్పష్టం చేశారు.

👉 ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, రోడ్డు భద్రత కోసం అందరూ సహకరించాలని కోరారు.

👉 మద్యం సేవించి వాహనాలు నడపడం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుందని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని హెచ్చరించారు.

👉 డ్రంక్ అండ్ డ్రైవ్ చట్టపరమైన నేరమని, అది ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతుందని తెలిపారు.

👉 యువత రోడ్డు భద్రత నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

ఈ కౌన్సిలింగ్‌లో టౌన్ ఎస్సైలు నవనీత్ రెడ్డి, సుప్రియతో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment