కాసేపట్లో పెళ్లి.. పెళ్లికూతురు గుండెపోటుతో మృతి
మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి అక్టోబర్ 26
పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ జిల్లా బర్గాడి గ్రామానికి చెందిన 20 ఏళ్ల పూజ అనే యువతి పెళ్లికి కొన్ని గంటల ముందే గుండెపోటుతో మృతి చెందింది. దుబాయ్‌లో పనిచేస్తున్న యువకుడితో అక్టోబర్ 24న ఆమె వివాహం జరగాల్సి ఉంది. సంగీత్ వేడుకలతో ఇల్లంతా హ్యాపీగా ఉన్న టైంలో ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారించారు. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పులు మోగడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.