సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘నానో బనానా’! మీ ఫోటోను 3డి బొమ్మగా మార్చండిలా!
ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొత్త AI ట్రెండ్ ‘నానో బనానా’. గూగుల్ జెమినీ ఆధారంగా పనిచేసే ఈ ట్రెండ్, కేవలం ఒక ఫోటో, కొన్ని పదాలతో మనల్ని, సెలబ్రిటీలను, పెంపుడు జంతువులను కూడా 3D బొమ్మలుగా మార్చేస్తుంది. ఈ ట్రెండ్ చాలా సులభం, దీనికి ఎటువంటి సాంకేతిక నైపుణ్యాలు అవసరం లేదు. దీనివల్ల ఇది చాలా వేగంగా ప్రాచుర్యం పొందింది.
నానో బనానా’ బొమ్మను ఎలా తయారు చేయాలి?
ఈ 3D బొమ్మను తయారు చేయడానికి కింద సూచించిన విధంగా చేయండి.
గూగుల్ జెమినీ లేదా గూగుల్ AI స్టూడియోను తెరవండి.
మీరు 3D బొమ్మగా మార్చాలనుకుంటున్న ఫోటోను అప్‌లోడ్ చేయండి.
ఈ కింద ఉన్న పదాలను కాపీ చేసి, పేస్ట్ చేయండి: “Create a 1/7 scale commercialised figurine of the characters in the picture, in a realistic style, in a real environment. The figurine is placed on a computer desk. The figurine has a round transparent acrylic base, with no text on the base. The content on the computer screen is a 3D modelling process of this figurine.