17 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులు.. పోక్సో కేసు నమోదు

ఆదిలాబాద్: 17 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులు.. పోక్సో కేసు నమోదు

ఆదిలాబాద్ పట్టణంలో మంత్రతంత్రాల పేరుతో 17 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించిన షేక్ కలీం అనే వ్యక్తిపై పోక్సో, బ్లాక్ మ్యాజిక్ రిమైడీస్ యాక్ట్, మోసం తదితర కేసులను నమోదు చేసినట్లు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి. సునిల్కుమార్ తెలిపారు. బాలిక ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు షేక్ కలీంను సంప్రదించగా, అతను బాలికకు దుష్టశక్తి సోకిందని నమ్మించి, నిర్మల్ మండలం సోన్ వద్ద గోదావరి వద్ద పూజలు చేసి తీసుకొచ్చాడు. అనంతరం ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను గదిలోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment