హైదరాబాద్: అక్టోబర్ 07
ముంబై చెంబూరులో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవదహనం అయిన ఘటన జరిగింది. పోలీసులు వివరాల ప్రకారం, దేవీ నవరాత్రుల సందర్భంగా ఇంట్లో పెట్టిన దీపం కారణంగా ఈ ప్రమాదం సంభవించింది.
చెంబూరులోని సిద్ధార్థ్ కాలనీలో తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న కిరాణా షాపులో పూజ అనంతరం వెలిగించిన దీపం ద్వారా మంటలు ప్రారంభమయ్యాయి. ఆ మంటలు షాప్‌లో నిల్వ ఉన్న కిరోసిన్‌కు అంటుకోవడంతో వేగంగా విస్తరించి మొదటి మరియు సెకండ్ ఫ్లోర్‌లో ఉన్న వారిని నిద్రలోనే మృత్యువాత పడేలా చేసింది.