ఎమ్4న్యూస్ (ప్రతినిధి)
హైదరాబాద్: అక్టోబర్ 19
ఓ 45 ఏళ్ల మహిళ కడుపులో 12 ఏళ్లుగా కత్తెర ఉందని ఇటీవల వైద్యులు గుర్తించారు, ఇది ఆమెకే కాకుండా వైద్యులకు కూడా షాక్ ఇచ్చింది. సిక్కింలో గ్యాంగ్‌టక్ లోని సర్ తుటోబ్ న్యామ్‌గల్ మెమోరియల్ హాస్పిటల్‌లో 2012లో అపెండిసైటిస్ సర్జరీ చేసినప్పుడు ఆమె పొట్టలో ఈ కత్తెర మిగిలిందని తేలింది.
ఆమె సర్జరీ తర్వాత కూడా కడుపునొప్పి తగ్గకపోవడంతో పలు ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకున్నారు, కానీ ఏవీ ఫలితం ఇవ్వలేదు. ఇటీవల ఎస్‌టీఎన్‌ఎం హాస్పిటల్‌లో పరీక్షలు చేయగా, ఎక్స్‌రేలో కత్తెర ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయంపై స్థానిక ప్రజా సంఘాలు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టాయి, దీనిపై సిక్కిం వైద్య ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించింది.