ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కంటోన్మెంట్ మెట్రో స్టేషన్ సమీపంలో బైక్ను బీఎండబ్ల్యూ కారు ఢీకొట్టింది. కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ నవజోత్ సింగ్ తన భార్యతో కలిసి బైక్పై వెళ్తుండగా వారిని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నవజోత్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన భార్యతో పాటు అటు కారులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.