కుటుంబ ఆస్తి పంపకంలో అన్యాయం: 4వ రోజుకి చేరిన రిలే నిరాహార దీక్ష

నిర్మల్ ఆర్డిఓ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష
  • చందుల సాయికిరణ్ కుటుంబం అధికారుల నిర్లక్ష్యంపై 4 రోజులుగా నిరాహార దీక్ష చేస్తోంది.
  • కుటుంబ ఆస్తి పంపకంలో అన్యాయం జరిగిందని చెబుతూ, అధికారులు స్పందించకపోవడం బాధాకరమని వ్యక్తీకరించారు.

 

నిర్మల్: అక్టోబర్ 17న

నిర్మల్ ఆర్డిఓ కార్యాలయం ఎదుట చందుల సాయికిరణ్ కుటుంబం నిరాహార దీక్ష చేస్తున్నట్లు తెలుస్తోంది. కుటుంబ ఆస్తి పంపకంలో అన్యాయం జరిగిందని, తనకు న్యాయం చేయాలని ఆయన అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా, ఇప్పటికీ స్పందన రాకపోవడంతో నిరసన కొనసాగిస్తున్నారని తెలిపారు.

 

నిర్మల్: 4వ రోజుకి చేరిన రిలే నిరాహార దీక్షలో చందుల సాయికిరణ్ తన కుటుంబంతో కలిసి ఆర్డిఓ కార్యాలయం ఎదుట కూర్చున్నారు. కుటుంబ ఆస్తి పంపకంలో జరిగిన అన్యాయం పై జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ, ఇప్పటికీ స్పందన రాకపోవడం వలన ఆయన ఈ దీక్ష చేపట్టారు.

చందుల సాయికిరణ్ మాట్లాడుతూ, “నా తండ్రి ఆస్తి వాటా పంపకంలో జరిగిన జాప్యం వల్ల నా కుటుంబం నష్టపోతుంది. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, సర్కిల్ ఇన్స్పెక్టర్‌కు పలు దరఖాస్తులు ఇచ్చినా ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. మేము 4 రోజులుగా దీక్షలో ఉన్నప్పటికీ, అధికార యంత్రాంగం స్పందించడం లేదు,” అని వేదన వ్యక్తం చేశారు.

అయితే, సంబంధిత అధికారులు ఈ అంశంపై ఇప్పటికీ స్పందించకపోవడం నిరసన కారుల ఆవేదనకు కారణమైంది. చందుల సాయికిరణ్ తన కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులను కోరుతూ, తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment