ఆస్తుల పంపకంలో నా కుటుంబానికి న్యాయం చేయాలి – రిలే నిరాహార దీక్ష

సాయి కిరణ్ కుటుంబం నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష
  • ఆస్తుల పంపకంలో అన్యాయం జరగిందని నిర్మల్ పట్టణానికి చెందిన సాయి కిరణ్ కుటుంబం నిరసన.
  • ఆర్డీవో కార్యాలయం ఎదుట 7 రోజులుగా రిలే నిరాహార దీక్ష.
  • CPM నాయకుల మద్దతు, అధికారుల సహకారం కోరుతూ పోరాటం.

నిర్మల్ పట్టణంలో సాయి కిరణ్ కుటుంబం ఆస్తుల పంపకంలో అన్యాయంపై ఆర్డీవో కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. సాయి కిరణ్ అన్నదమ్ములు తనకు భూముల పంపకంలో అన్యాయం చేశారని ఆరోపిస్తున్నారు. సిపిఎం నాయకులు కూడా దీక్షకు మద్దతుగా నిలిచారు. తక్షణమే న్యాయం చేయాలని వారు అధికారులను కోరుతున్నారు.

 

నిర్మల్ పట్టణ బుధవార్ పేట్ కాలనీకి చెందిన సాయి కిరణ్ తన కుటుంబానికి ఆస్తుల పంపకంలో న్యాయం చేయాలంటూ ఆర్డీవో కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సాయి కిరణ్ విలేకరులతో మాట్లాడుతూ, తన అన్నదమ్ములు భూముల పంపకంలో తన కుటుంబానికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. తనకు తెలియకుండానే భూములను దాచిపెట్టి, కొన్నింటికి మాత్రమే లెక్కలు చూపుతున్నారని ఆయన వాపోయారు.

గత మూడు సంవత్సరాలుగా పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీలు జరిగినప్పటికీ తన కుటుంబానికి న్యాయం చేయలేదని సాయి కిరణ్ పేర్కొన్నారు. జిల్లా ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేసినా, ఇప్పటికీ స్పందన రాకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడు రోజులుగా నిరాహార దీక్ష కొనసాగుతున్నప్పటికీ అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాలేదని అన్నారు.

సోమవారం CPM నాయకులు ఈ నిరసనకు మద్దతుగా నిలిచారు. సాయి కిరణ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగుతుందని CPM నాయకులు స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment